పాకిస్తాన్‌లో ప్రముఖ రైడ్ హైలింగ్ ఫ్లాట్ ఫాం ఉబర్ యాప్ ఆనవాళ్లు తుడుచుకు పెట్టుకుపోయాయి. 2024 ఏప్రిల్ 30 నుంచి పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఉబర్ సర్వీసులు నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఉబర్ యాప్ యూజర్లకు మెస్సేజ్ పంపింది. ఇకపై ఉబర్ వినియోగదారులు కెరీమ్ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవాలని యూజర్లకు మెస్సేజ్ పంపింది.
2019లో కెరీమ్ రైడ్ హిలింగ్ ఫ్లాట్ ఫాంను ఉబర్ 3.1 డాలర్లకు కొనుగోలు చేసింది. తర్వాత 2022లో ఇస్లామాబాద్, కరాచీ, ముల్తాన్, ఇంకా కొన్ని నగరాల్లో ఉబర్ యాప్ సర్వీసులు నిలిపివేసింది. అప్పటి నుంచి లాహోర్ మినహా 5 సిటీల్లో ఉబర్ కెరీమ్ యాప్ ద్వారా సర్వీసులు అందిస్తుంది. ఉబర్ సర్వీసులు అందిస్తున్న ఒకేఒక్క సిటీ లాహార్.. ఇక్కడ కూడా ఏప్రిల్ 30 నుంచి ఉబర్ సర్వీసులు పనిచేయవని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల చాలా మంది లాహార్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇక నుంచి ఉబర్ యూజర్లను కెరీమ్ యాస్ లో సేవలు రైడ్స్ బుక్ చేసుకోవాలని తెలిపింది.