ఓఎన్‌‌‌‌‌‌‌‌డీసీలో ఉబర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు


బెంగళూరు:  సర్వీస్‌‌‌‌‌‌‌‌లను  విస్తరించేందుకు ప్రభుత్వ ఈ–కామర్స్  ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌  ఓపెన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌‌‌‌‌‌‌‌ (ఓఎన్‌‌‌‌‌‌‌‌డీసీ) లో ఉబర్ జాయిన్ అయ్యింది.  ఈ  కంపెనీ గ్లోబల్ సీఈఓ డారా  ఖోష్క్రోవ్సహి  ‘పెద్ద సైజ్‌‌లో  టెక్నాలజీని నిర్మించడం’  అనే టాపిక్‌‌‌‌‌‌‌‌పై  ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకనితో గురువారం మాట్లాడారు. ఇండియా డిజిటల్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంపెనీలు, ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని కామెంట్ చేశారు. 

 టెక్నాలజీ కంపెనీగా ఓపెన్  సోర్స్ టెక్‌‌‌‌‌‌‌‌లపై ఉబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆసక్తి ఉందని చెప్పారు. ఉబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం ఏంటని  నందన్‌‌‌‌‌‌‌‌ నిలేకని అడగగా,  ఇండియా అత్యంత క్లిష్టమైన మార్కెట్ అని డారా అన్నారు.  ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా చెల్లించడానికి ఇష్టపడరని, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఎక్కడైనా సక్సెస్ అవ్వగలమని ఆయన పేర్కొన్నారు. లో – కాస్ట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను విస్తరిస్తామని  చెప్పారు.