8.6 శాతం పెరిగిన యూబీఐ లోన్లు

8.6 శాతం పెరిగిన యూబీఐ లోన్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూనియన్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (యూబీఐ)  లోన్ల వృద్ధి మార్చి 2025 క్వార్టర్​లో 8.6 శాతం పెరిగి రూ.9.82 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2024 చివరి నాటికి మొత్తం అడ్వాన్సులు రూ.9.04 లక్షల కోట్లుగా ఉన్నాయని బ్యాంక్ పేర్కొంది. 

గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​ చివరి నాటికి మొత్తం డిపాజిట్ల విలువ రూ.12.21 లక్షల కోట్ల నుంచి  7.22 శాతం పెరిగి రూ.13.09 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి చివరి నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.21.26 లక్షల కోట్లతో పోలిస్తే వార్షికంగా 7.8 శాతం పెరిగి రూ.22.92 లక్షల కోట్లకు చేరుకుంది.