ముంచుకొచ్చిన సంక్షోభం : ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంక్​లో 35 వేల మంది ఔట్​

ముంచుకొచ్చిన సంక్షోభం : ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంక్​లో 35 వేల మంది ఔట్​

స్విట్జర్లాండ్​ ఆధారిత యూబీఎస్  స్విస్​ క్రెడిట్​ బ్యాంక్ తన సంస్థలో భారీగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు రాయిటర్స్​ నివేదిక వెల్లడించింది. సుమారు 35వేల మందిని తొలగించనుంది. క్రెడిట్​ సూయిజ్​ ప్రస్తుతం 45వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ సంస్థ లండన్​, న్యూయార్క్​, ఆసియాలోని పలు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. యూబీఎస్  రెండు స్విస్ బ్యాంకుల ఉమ్మడి వర్క్‌ఫోర్స్‌ను దాదాపు 30 శాతం తగ్గించాలని యోచిస్తోంది. దీంతో దాదాపు 35,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఆసియా, ఆస్ట్రేలియాలో కోతలు

యూబీఎస్​  రాబోయే నెలలో క్రెడిట్ సూయిస్‌లో ఆసియా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కోతలు ఆస్ట్రేలియా, చైనాల పెట్టుబడి బ్యాంకర్లపై ప్రభావం చూపనున్నాయి. చైనాయేతర ఆర్థిక సంస్థలను కవర్ చేసే డీల్‌మేకర్‌లను కొనసాగించవచ్చని వెల్లడించింది. గతంలో ఆసియాలో పనిచేసిన క్రెడిట్ సూయిస్ బ్యాంకర్లు ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేస్తున్నారు.