యూకో బ్యాంక్ లాభం రూ.551 కోట్లు

యూకో బ్యాంక్ లాభం రూ.551 కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో  ప్రభుత్వ సంస్థ యూకో బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు   రూ.551 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.223 కోట్లతో పోలిస్తే ఇది 147 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. ఇబిటా (ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వడ్డీలకు ముందు ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 9.81 శాతం పెరిగి రూ.1,321 కోట్లకు చేరుకుంది.  యూకో బ్యాంక్ గ్రాస్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (ఇచ్చిన అప్పులు)  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,93,253 కోట్లకు పెరిగాయి.

17.64 శాతం వృద్ధి చెందాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 7.39 శాతం పెరిగి రూ.2,68,155 కోట్లుగా రికార్డయ్యాయి. యూకో బ్యాంక్  మొండిబాకీలు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తగ్గాయి. బ్యాంక్ గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 1.16 % తగ్గి 3.32 శాతంగా,  నెట్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 0.40 %  తగ్గి 0.78 శాతంగా రికార్డయ్యాయి.