న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో యూకో బ్యాంక్‌కు రూ. 581.24 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ. 312.18 కోట్లతో పోలిస్తే ఇది 86.19 శాతం గ్రోత్‌కు సమానం. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 1,652.38 కోట్ల నుంచి 19.34 శాతం పెరిగి రూ.1,972.11 కోట్లకు చేరుకుంది.
కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం యూకో బ్యాంక్ నికర లాభం 11 శాతం (రూ.652.97 కోట్ల నుంచి) తగ్గింది. బ్యాంక్ ప్రొవిజన్లు క్యూ4 లో రూ.450.54 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్, 2022 లో ఈ నెంబర్ రూ.332.42 కోట్లుగా రికార్డయ్యింది. బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏలు భారీగా తగ్గాయి.
కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 7.89 శాతంగా నమోదైన బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో, తాజా మార్చి క్వార్టర్‌లో 4.78 శాతానికి మెరుగుపడింది. నెట్ ఎన్‌పీఏల రేషియో 1.66 % నుంచి 1.29 శాతానికి తగ్గింది. 2022–23 లో బ్యాంక్‌కు రూ. 1,862.34 కోట్ల నికర లాభం వచ్చింది.ఇదే హయ్యస్ట్ ఇయర్లీ ప్రాఫిట్ కావడం విశేషం.