దక్షిణ మధ్య రైల్వే AGMగా ఉదయ్ కుమార్ రెడ్డి

దక్షిణ మధ్య రైల్వే AGMగా ఉదయ్ కుమార్ రెడ్డి

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ గా పి.ఉదయ్ కుమార్ రెడ్డి ఇవాళ (తేదీ  02 జనవరి 2023) బాధ్యతలు స్వీకరించారు. ఉదయ్ కుమార్ రెడ్డి 1986 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఐఆర్ఎస్ఎంఈ) విభాగానికి చెందినవారు. ఆయన ఇంతకుముందు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 1983లో జమాల్ పూర్ లో స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ గా ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగిగా చేరారు. 

ఉదయ్ కుమార్ రెడ్డికి ఈస్టర్న్ రైల్వే, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, దక్షిణ మధ్య రైల్వే, సదరన్  రైల్వేలో పనిచేసిన విశేష అనుభవం ఉంది. భారతీయ రైల్వేలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఖరగ్‌పూర్‌లో అసిస్టెంట్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ఆరంభించారు. ఉదయ్ కుమార్ రెడ్డి భారతదేశంతో పాటు  విదేశాలలో నాయకత్వ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ( వ్యూహాత్మక యాజమాన్యం)పై అనేక శిక్షణా కార్యక్రమాలను పొందారు.

ఉదయ్ కుమార్ రెడ్డి నిర్వర్తించిన పదవులలో కొన్ని.. 

బెంగళూరులో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్.
చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ లాలగూడా, దక్షిణ మధ్య రైల్వే.
తిరుసిరాపల్లిలో సదరన్ రైల్వే డివిజనల్ మేనేజర్.
సదరన్  రైల్వేలో చీఫ్ వర్క్‌షాప్ ఇంజనీర్.
సదరన్ రైల్వే చీఫ్ మెకానికల్ ఇంజనీర్.
చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ ప్లానింగ్ ఇంజనీర్ గా పని చేశారు.