ఒత్తిడిని జయించిన వీరుడు: కోహ్లీ, గిల్‌ను గుర్తు చేస్తున్న ఉదయ్ సహారన్

ఒత్తిడిని జయించిన వీరుడు: కోహ్లీ, గిల్‌ను గుర్తు చేస్తున్న ఉదయ్ సహారన్

ఉదయ్ సహారన్.. ప్రస్తుతం ఈ పేరు మారు మ్రోగిపోతుంది. అండర్ 19 లో భారత కెప్టెన్ గా అదరగొడుతున్నాడు. ఓ వైపు కెప్టెన్సీతో, మరోవైపు బ్యాటింగ్ తో టీమిండియాకు వరుస విజయాలను అందిస్తున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ను ఫైనల్ కు చేర్చి టీమిండియా స్టార్ ఆటగాళ్లను గుర్తు చేస్తున్నాడు. ఉదయ్ లోని పరిణితి చెందిన ఆటకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 

దక్షిణాఫ్రికాపై నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో చివరి వరకు పోరాడి భారత్ కు విజయాన్ని అందించాడు 124 బంతుల్లో 6 ఫోర్లతో 81 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో సచిన్ దాస్ 95 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర మరువలేనిది. అయితే కెప్టెన్ ఉదయ్ సహారన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించి తీరు అత్యద్భుతం. 32 పరుగులకే నాలుగు వికెట్లు పడినప్పటికీ సహచర ప్లేయర్ కు ధైర్యం చెబుతూ తాను మాత్రం క్రీజ్ లో పాతుకుపోయాడు.
 
సాధారణ టార్గెట్ అయినప్పటికీ టీమిండియా విజయం సాధించే వరకు ఎక్కడా చెత్త షాట్ ఆడలేదు. ఇన్నింగ్స్ ఆసాంతం చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ ఒక్క పరుగు చేయాల్సిన దశలో రనౌటయ్యాడు. అప్పటికే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసింది. ఈ టోర్నీ అంతటా ఉదయ్ తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను ఆకట్టుకున్నాడు. మొత్తం 6 మ్యాచ్ ల్లో 3 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ చేశాడు. ఆడిన ప్రతి ఇన్నింగ్స్ లోనూ 30కి పైగా పరుగులు సాధించాడు. 

ఉదయ్ ను చూస్తుంటే భవిష్యత్తులో భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో కోహ్లీ, గిల్ ఇలాంటి ఆట తీరుతోనే భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు. 2008 అండర్ వరల్డ్ కప్ లో కోహ్లీ 235 పరుగులు చేస్తే.. 2018 ఎడిషన్ లో గిల్ 104 యావరేజ్ తో 418 పరుగులు చేశాడు. ఇప్పటికే 389 పరుగులు చేసి కోహ్లీని దాటేసిన ఈ 19 ఏళ్ళ కుర్రాడు ఫైనల్లో మరో 30 పరుగులు చేస్తే గిల్ ను వెనక్కి నెడతాడు. ఫైనల్ మ్యాచ్ లో సైతం ఇలాంటి ఆట తీరునే ప్రదర్శించి భారత్ కు వరల్డ్ కప్ అందిస్తే టీమిండియాకు మరో భవిష్యత్తు స్టార్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. 

 అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 32 రన్స్‌‌‌‌కే 4 కీలక వికెట్లు కోల్పోయినా.. సచిన్‌‌‌‌ దాస్‌‌‌‌ (95 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 96), కెప్టెన్‌‌‌‌ ఉదయ్‌‌‌‌ సహరన్‌‌‌‌ (124 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 81) పోరాట స్ఫూర్తి చూపెట్టారు. విజృంభిస్తున్న సౌతాఫ్రికా బౌలింగ్‌‌‌‌కు కళ్లెం వేస్తూ.. వీరోచిత బ్యాటింగ్‌‌‌‌తో ఇండియాను తొమ్మిదోసారి ఫైనల్‌‌‌‌కు చేర్చారు. టాస్‌‌‌‌ ఓడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 244/7 స్కోరు చేసింది. లుహాన్‌‌‌‌ డ్రి ప్రిటోరియస్‌‌‌‌ (102 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 76), రిచర్డ్‌‌‌‌ సెలెట్స్‌‌‌‌వానె (100 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 64) రాణించారు.