తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..ఇవాళ ప్రమాణం స్వీకారం

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..ఇవాళ ప్రమాణం స్వీకారం
  • నియమించిన తమిళనాడు  సీఎం స్టాలిన్.. నేడు ప్రమాణం  

చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ కు రాజకీయంగా ప్రమోషన్ దక్కింది. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ శనివారం సిఫారసు చేశారు. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలోని రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో ఉదయనిధి ప్రమాణం చేయనున్నారు. 

ఉదయనిధి ప్రస్తుతం యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా ఉండగా, అదనంగా ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖను కూడా అప్పగించారు.  అలాగే మనీలాండరింగ్ కేసులో గురువారమే బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రవాణా శాఖ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని స్టాలిన్ మళ్లీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాలాజీ కూడా మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.