మోదీ ఎక్కడైతే ప్రచారం చేసిండో..అక్కడ బీజేపీ ఓటమి:ఉద్ధవ్ థాకరే 

మోదీ ఎక్కడైతే ప్రచారం చేసిండో..అక్కడ బీజేపీ ఓటమి:ఉద్ధవ్ థాకరే 

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ శక్తిని చూపించారన్నారు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాకరే. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అనూహ్య విజయం సాధించిందన్నారు. మహరాష్ట్రలో ఎన్డీయే కూటమికి తగిన బుద్ది చెప్పారని ఉద్దవ్ థాకరే అన్నారు.  కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూటమి అడుగులు వేస్తోందన్నారు. బీజేపీ వేధించిన అన్ని స్వతంత్ర పార్టీలు కూటమిలో చేరుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు కూటమితోపాటు టీడీపీ నేత చంద్రబాబు, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.  
మోదీ ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ బీజేపీ ఓడిపోయింది. ప్రధాని మా పార్టీని చీల్చి ఇబ్బందుల్లోకి నెట్టారు. అయినా మేం నిలబడ్డం. ప్రధాని మోదీతోపాటు , మహారాష్ట్ర అధికార పార్టీ నాపై విమర్శలు చేస్తూనే వచ్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీ వల్లే మేం గెలిచామని ప్రధాని మోదీ అనడం విడ్డూరంగా అనిపించింది. అయితే వాస్తవానికి మహారాష్ట్రలో బాల్ థాకరే ఫొటో పెట్టుకొని ప్రధాని ఎన్నికల్లో లబ్ధి పొందారని  ఉద్ధవ్ థాకరే అన్నారు.