ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాబోయే ప్రధాని అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు . అందుకే సినీనటుడు రజనీకాంత్ ఆయన పాదాలను తాకినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధానిగా చూడాలని చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే రజనీకాంత్ ప్రధాని మోడీకి కూడా ఇంత మర్యాద చూపించలేదని.. యోగిలో ఆయన కాబోయే ప్రధానిని చూస్తున్నారని చెప్పారాయన.
ఇదిలా ఉండగా సన్యాసి లేదా యోగి కనిపిస్తే తనకు వయస్సుతో సంబంధం లేకుండా వారి పాదాలపై పడటం తనకు అలవాటని.. అదే తాను చేసానని రజనీకాంత్ అన్నారు. ఇటీవల లక్నో పర్యటన సందర్భంగా యోగి పాదాలను తాకడంపై జరిగిన చర్చలపై చెన్నైలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ : బీసీలు, మహిళలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది : డీకే అరుణ
రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటికి వెళ్లారు. అక్కడ యోగి పాదాలకు నమస్కరించారు. 72 ఏళ్ల రజినీకాంత్ ..తనకంటే చిన్నవారైన యోగి పాదాలను తాకడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.