ఉడిపి కాలేజీ బాత్రూమ్ ఘటన.. 1992 అజ్మీర్ లైంగిక కేసుతో లింక్

ఉడిపి కాలేజీ బాత్రూమ్ ఘటన.. 1992 అజ్మీర్ లైంగిక కేసుతో లింక్

కర్నాటక ఉడిపిలోని  ఓ  పారామెడికల్ కాలేజ్ లో చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు..  వాష్‌రూమ్‌లో మరో విద్యార్థినిని నగ్నవీడియో తీసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది. వీడియో తీసిన ముగ్గురు అమ్మాయిలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసును 1992 నాటి అజ్మీర్ లైంగిక కుంభకోణానికి లింక్ చేస్తున్నారు. ఇది కూడా అలాంటి కేసే అని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 

మెడికల్ కాలేజీలో ఏం జరిగిదంంటే...

ఉడిపిలోని నేత్రాజ్యోతి పారామెడికల్ కాలేజ్ లో చదువుతున్న అలిమతుల్లా షయిఫా, శబనాజ్, ఆలియా అనే ముస్లీం అమ్మాయిలు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని బాత్ రూమ్ ల్లో సెల్ఫోన్ కెమెరా పెట్టి వీడియో తీశారు. ఈ వీడియోను అదే కాలేజ్ లో చదువుతున్న ఫ్రెండ్స్ గ్రూప్ లో, ఇతరలకు షేర్ చేశారు. 

సస్పెండ్..కేసు నమోదు..

ముగ్గురు విద్యార్థినులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో కాలేజీ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది.  కాలేజీలోకి సెల్ ఫోన్లు తెచ్చినందుకు.. రహస్యంగా వీడియో తీసినందుకు రెండు నేరాల కింద వీరిని సస్పెండ్ చేశారు. అంతేకాదు  మల్పే పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు విద్యార్థినులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

అజ్మీర్ లైంగిక కేసుకు లింక్...

ఉడిపి పారామెడికల్ ఘటన కేసును 1992 అజ్మీర్ లైంగిక కుంభకోణానికి లింక్ చేస్తున్నారు. ఈ కేసు కూడా అలాంటి కేసే అని గుర్తు చేస్తున్నారు. 

ALSO READ :నిర్మల్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు.. తిమ్మాపురం చెరువుకు గండి

1992 అజ్మీర్ కేసు ఏంటీ

1992 అజ్మీర్ రేప్ కేసు దేశాన్ని కుదిపేసింది.  రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పాఠశాలు, కళాశాలకు చెందిన ఐదు వందల మంది  బాలికలపై వరుస సామూహిక అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌ చేశారు కొందరు దుర్మార్గులు.  అజ్మీర్ షరీఫ్ దర్గా సంరక్షణను పర్యవేక్షించే  ఖాదీం కుటుంబానికి చెందిన ఫరూఖ్, నఫీస్ చిష్టీ నేతృత్వంలోని యువకులు ....ఓ అమ్మాయితో స్నేహం చేసి ఆమెను ఈ ఉచ్చులోకి లాగారు.  అమ్మాయి ద్వారా వందలాది మంది పాఠశాల, కాలేజీలకు చెందిన బాలికలను లోబర్చుకున్నారు. తమ ఫాంహౌజ్ లకు రప్పించుకుని..వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు.  బయటకు చెప్తే ఫోటోలు, వీడియోలు బయటపెడతామని హెచ్చరించారు. అయితే ఈ దారుణాలపై దైనిక్ నవజ్యోతి అనే స్థానిక వార్తాపత్రిక కథనం  ప్రచురించడంతో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఘటన  తీవ్ర సంచలనంగా మారింది.

ఉడిపి ఘటనను మానవ హక్కుల కార్యకర్త రష్మీ సమంత్ అజ్మీర్ కేసుతో  ముడిపెట్టారు. అజ్మీర్ కేసులో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి దారుణాలకు ఒడిగట్టారని..బాధిత  అమ్మాయిలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ఉడిపి ఘటన కూడా అలాంటిదే అని ఆరోపించారు. ఉడిపి నర్సింగ్ కాలేజీలో అమ్మాయి  నగ్న  వీడియోలు, ఫోటోలను..ముస్లీం అమ్మాయిలు వారి కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఉడిపి ఘటనను అజ్మీర్ సెక్స్ స్కాండల్‌తో లింక్ చేస్తూ..మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ఘటనను  'అజ్మీర్ 1992 పార్ట్ 2' అని పేర్కొన్నాడు.. ఇంకో వ్యక్తి ఈ ఘటనను 'ఉడిపి ఫైల్స్' అంటూ కామెంట్ చేశాడు.