మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఉద్యమకారుల సమితి మద్దతు

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో టీఆర్ఎస్​ను ఓడించటానికి ఉద్యమకారులకు ఇదే మంచి అవకాశమని 1969 ఉద్యమకారుల సమితి ప్రెసిడెంట్, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఉద్యమకారుల సమితి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. బుధవారం బంజారాహిల్స్​లో కిషన్ రావు అధ్యక్షతన 1969 ఉద్యమకారుల సమితి మీటింగ్ జరిగింది.

తమ సమస్యలను తెలిపేందుకు 10 సార్లు కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరామని..కానీ ఇంత వరకు ఇవ్వలేదని కిషన్ రావు తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులు, సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చినవారికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.