రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్‌‌ ఉత్సవ్‌‌

రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్‌‌ ఉత్సవ్‌‌
  • మొక్కల పెంపకం, పంటలకు సంబంధించి 50 స్టాళ్లు ఏర్పాటు 
  • ఈ నెల 13 వరకు కొనసాగనున్న ఉత్సవ్‌‌

సికింద్రాబాద్, వెలుగు :సికింద్రాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్‌‌ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గురువారం ఆర్గానిక్‌‌ ఫార్మింగ్‌‌ రైతు సురేశ్‌‌ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై  అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు సాధికార సమితి, కమ్యూనిటీ సహజ వ్యవసాయ సైంటిస్టులు.. రైతులకు సహజ వ్యవసాయం, సుస్థిర హార్టికల్చర్‌‌, ఆలుగడ్డ, అల్లం నిర్వహణ విధానం, ఆఫ్‌‌ సీజన్‌‌లో కూరగాయల సాగు, డ్రై ఫ్లవర్‌‌ సాంకేతిక అంశాలను వివరించారు. 

అలాగే వివిధ పంటలకు సంబంధించిన అంశాలు, మొక్కల పెంపకంపై 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్‌‌ అండ్‌‌ ఫార్మర్స్‌‌ వెల్పేర్‌‌ జాయింట్‌‌ సెక్రటరీ సామ్యూల్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ ఈ ఉద్యాన్‌‌ ఉత్సవ్‌‌ 13వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రకృతి ఔత్సాహికులు, ఉద్యాన వన ప్రేమికులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలు, మొక్కలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు.

 కార్యక్రమంలో మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ శరవణన్‌‌ రాజ్‌‌, ఐసీఏఆర్‌‌ ఏటీ ఏఐఆర్‌‌ఐ డైరెక్టర్‌‌ షేక్​ మీరా, అగ్రికల్చర్‌‌ ఏడీఏ హుస్సేన్‌‌బాబు, అగ్రికల్చర్‌‌ అండ్‌‌ ఫార్మర్స్‌‌ వెల్ఫేర్‌‌ అడిషనల్‌‌ కమిషనర్‌‌ సంజయ్‌‌కుమార్‌‌, రాష్ట్రపతి నిలయం డైరెక్టర్‌‌ శివేంద్ర చతుర్వేది, డాక్టర్‌‌ రజనీప్రియ పాల్గొన్నారు. ఉద్యాన్‌‌ ఉత్సవ్‌‌ సందర్భంగా పుష్పాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సౌల్‌‌ సెంట్రల్‌‌ జోన్‌‌ కల్చరల్‌‌ సెంటర్‌‌ ఆద్వర్యంలో ఒడిశా శంఖవదనం, రానప్ప, ఛాదేయ, మహారాష్ట్ర కళాకారులు లావాని, కోలి, వాగ్య మురళీ నృత్యం, తెలంగాణ బోనాలు, లంబాడి నృత్యం, మధ్యప్రదేశ్‌‌ కళాకారులు తాత్యా -గోండీ, కర్మ, దందద్‌‌ వంటి జానపద, ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి.