రాష్ట్రపతి నిలయంలో డిసెంబర్ 29 నుంచి ఉద్యాన్ ఉత్సవ్

రాష్ట్రపతి నిలయంలో డిసెంబర్ 29 నుంచి ఉద్యాన్ ఉత్సవ్

కంటోన్మెంట్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 29 నుంచి 15 రోజులపాటు ‘ఉద్యాన్ ఉత్సవ్’ నిర్వహించనున్నారు. అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖలు అవలంబిస్తున్న నూతన పద్ధతులను వివరించేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్యాన ఉత్సవ్ ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడి విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఏర్నాటు చేసిన మిట్టీ  కేఫ్, సావనీర్ షాపును ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలోని కంపోస్ట్ తయారీ యూనిట్​ను సందర్శించారు.