
- ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త, ఉద్యోగ సంఘ నాయకుడు ఎమ్వీఐ అజ్మీరా శ్యామ్‌నాయక్ వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
Also Read : మంత్రి ఇంటి పట్టా ఇచ్చినా.. హోంగార్డు కబ్జా చేస్తుండు
ఈ నెల30న తన వీఆర్ఎస్ దరఖాస్తు ఆమోదం పొందనుందని తెలిపారు. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సమావేశంలో టీఎన్జీఓ నాయకులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.