నిజంగా ఏలియన్స్ భూగ్రహానికి వచ్చాయా? ఎగిరే పళ్లాలాంటి UFO లలో గ్రహాంతర వాసులు భూమ్మీదకు వస్తున్నారా..? భూమిపై పరిశోధనలు ఏమైనా చేస్తున్నారా? దశాబ్దకాలంగా అంతుచిక్కని ప్రశ్నలు.. అమెరికా లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న దేశాలు గ్రహాంతర వాసులు భూగ్రహానికి వస్తున్నారు అని ఊహించనప్పటికీ వాటిని సరైన ఆధారాలేవు.. ఇప్పుడు ఏలియన్స్ గురించి ఎందుకు ప్రస్థావన వచ్చిందంటే.. ఇటీవల న్యూయార్క్ ఆకాశంలో కనిపించిన వింతైన వస్తువు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. దాని ఫొటోలు తీసి షేర్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. నెటిజన్లలో అనేక ప్రశ్నలను రేకితిస్తున్నాయి.
మార్చి నెల్లో లాగార్డియా ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగింది. మార్చి 25న ఓ విమానంలో ప్రయాణిస్తున్న మిచెల్ రేయోస్ అనే వ్యక్తి కిటికీలోంచి చూస్తుండగా అం త ఎత్తులో ఎగురుతున్న వింత సిలిండర్ దర్శనమిచ్చింది. మొదట్లో అది డ్రోన్ అని భావించిన మిచెల్ తర్వాత అది డ్రోన్ కాదని.. ఏదో వింత వస్తువని గుర్తిం చా డు ..ఫొటోలు తీసి ఫుటేజీని ఒహియోలోని మ్యూచువల్ యూఎఫ్ వో నెట్ వర్క్ స్టేట్ డైరెక్టర్ థామస్ వెర్ట్సన్కు పంపించాడు. దీనిపై ఆయన సమగ్ర విశ్లేషణ చేశారు.
వీడియో ను పరిశీలించిన థామస్..ఇది హెలికాప్టర్, డ్రోన్ లేదా మిలిటరీ ఆపరేటెడ్ ఎయిర్ క్రాప్ట్ వంటిది కాదని నిర్దారించారు. మిలిటరీ ఆపరేటెడ్ ఎయిర్ క్రాప్ట్ అయితే అంత ఎత్తులో.. అందులో విమానాలు ఎగిరే మార్గంలో ఉండవని తేల్చి చెప్పాడు థామస్.
యూఎఫ్వోపై పెంటగాన్
UFO అనేవి ఎగిరే పళ్లాల వంటి గుర్తించబడని వాహనాలు. ఇవి సాధారణంగా గ్రహాంతర వాసుల వాహనాలని నమ్ముతారు.. ఇతర గ్రహాల నుంచి ఏలియన్స్ ఈ వాహనాల్లో కనిపించినట్లు దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఏదీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. యూఎఫ్వో వంటివి తరుచుగా యూఎస్లో కనిపిస్తుంటాయి. ఇవి గ్రహాంతర ఫ్లైట్స్ అని ఎలాంటి ఆధారాలు లేవు..థామస్ తీసిన ఆ దృశ్యాలు తప్పుగా ఊహించినట్లు పెంటగాన్ మార్చిలో విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది.