
బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ 2023–-24 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్స్ కు అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సులు: నాలుగేళ్ల బీఏ ఆనర్స్: (ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, ఫిలాసఫీ, సోషల్ సైన్స్), నాలుగేళ్ల
బీఎస్సీ ఆనర్స్: (బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), నాలుగేళ్ల బీఎస్సీ బీఈడీ డ్యూయల్-డిగ్రీ: (బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 ఏళ్లు మించకూడదు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం కోసం www.azimpremjiuniversity.edu.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.