అంబేద్కర్ యూనివర్సిటీ: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు..లాస్ట్ డేట్ జనవరి 31

అంబేద్కర్ యూనివర్సిటీ: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు..లాస్ట్ డేట్ జనవరి 31

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి-ఫిబ్రవరి సెషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను మీ సమీప అధ్యయన కేంద్రాలకు వెళ్లి తెలుసుకోవచ్చు.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 31 లోగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

డిగ్రీ కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ , 
కోర్సు కాలపరిమితి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు) 
పీజీ కోర్సులు : ఎంఏ(జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ)

  • ఎమ్మెస్సీ: మ్యాథ్య్స్ / అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలనీ, బొటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ)
  • ఎంకామ్ 
  • ఎంఎల్ ఐఎస్సీ

డిప్లొమా కోర్సులు : సైకలాజికల్ కౌన్సెలింగ్ ఎన్విరాన్ మంట్ స్టడీస్, రైటింగ్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్

పీజీ డిప్లొమా కోర్సులు: విభాగాలు: మార్కెటింగ్ మేనేజ్ మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్ మెంట్( హెచ్ ఆర్ ఎం), ఆపరేషనల్ మేనేజ్ మెంట్ . 

సర్టిఫికెట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఎన్జీవోస్ మేనేజ్ మెంట్, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్

అర్హతలు: 

డిగ్రీ కోర్సులకు: ఇంటర్ లేదా తత్సమానా విద్యార్హత ఉండాలి. నేషన్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే.. 

పీజీ కోర్సులకు: ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్ ) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

డిప్లొమా కోర్సులు: ఏదైనా డిగ్రీ ఉండాలి

సర్టిఫికెట్ కోర్సులు:  పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి. 
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా 
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : 31-01-2024