నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్ సెషన్ 2025-–26కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది. పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
కోర్సులు: బ్యాచిలర్ కోర్సు నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (బీడీఈఎస్): ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌టైల్ డిజైన్/ నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్/ ఫ్యాషన్ ఇంటీరియర్. పీజీ కోర్సులో మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఫ్‌ఎం), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్) కోర్సులు రెండేళ్ల డ్యురేషన్‌తో ఉంటాయి. పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ) అందుబాటులో ఉంది.
అర్హతలు: యూజీ కోర్సుకు ఇంటర్లో ఉత్తీర్ణత సాధించాలి. పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్, బీఈ, బీటెక్; పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు యూజీకి 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థుల ఆన్లైన్లో జనవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. డిగ్రీ, పీజీకి సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏప్రిల్‌లో ఉంటుంది. పీహెచ్‌డీ కోర్సుకు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఏప్రిల్ లో నిర్వహిస్తారు. వివరాలకు www.nift.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.