
ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు అంటే ఉగాది పండుగ రోజే నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ( 2025) ఉగాది పండుగ మార్చి 30న వచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది (2025) కొత్త సంవత్సరం పేరేమిటో తెలుసుకుందాం. .
Ugadi 2025: చైత్ర శుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది - ఉగాది పండుగ... 2025లో మార్చి 30 ఆదివారం ఉగాది వచ్చింది. ప్రస్తుతం మనం 2024వచ్చిన క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం...2025 మార్చి 30 నుంచి విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం... గతంలో విశ్వావసు నామ సంవత్సరం గతంలో 1965 -1966 లో వచ్చింది..
పంచాంగం ప్రకారం తెలుగు సవంత్సరాలు మొత్తం 60 వాటిలో.. 2025 మార్చి 30న ప్రారంభమయ్యే విశ్వావశు నామ సవంత్సరం 39 వది. తెలుగు సంవత్సరాలకున్న 60 పేర్లకు చాలా రకాల పురాణ కథలున్నాయి. శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు. మరో కథనం ప్రకారం దక్షప్రజాపతి కుమార్తెల పేర్లని.. ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది.
హిందువుల పండుగలను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమంతటా జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో.. ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది అని.. తమిళులు.. పుత్తాండు అని.. సిక్కులు ఈ పండుగను వైశాఖీ పండుగ అని పిలుస్తారు. ఇక మహారాష్ట్రలో గుడిపాడ్వా అని.. మలయాళీలు .. విషు అని అంటారు. బెంగాలీలు .పొయ్‌లా బైశాఖ్ పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు.
బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజునే ఉగాదిగా జరుపుకుంటారు.
చాంద్రమానం ప్రకారం ..పురాణాల్లో ఉగ అంటే నక్షత్ర గమనం. దీనినే ఉగాది అంటారు. బ్రహ్మ పురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం 432లక్షల సంవత్సరాలు..రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మదేవుడికి ఒకరోజు అంటే…864 లక్షల సంవత్సరాలు. .అంటే ..3 లక్షల 11 వేల 40 సంవత్సరాలు పూర్తిచేస్తే ఒక్క రోజు కింద లెక్క.. ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్షు.
ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు పూర్తిచేశారు . ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆయన వయస్సు 51 సంవత్సరాలు.ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేత వరాహ కల్పే... వైవస్వత మన్వంతరే .. కలియుగే.. ప్రథమ వర్షే... ద్వితీయ పరార్ధే...అంటూ చదువుతారు.
మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది.. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఇదే.. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదిరోజే. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని.. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం.