
కాలగమనంలో మరో ఏడాది కలసిపోనుంది. 2025 మార్చి 30నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంఢం కానుంది. ఉగాది పండుగ వస్తోందంటే చాలు.. హిందువులు అందరూ కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి. ఎంత సంపాదన ఉంటుంది.. ఖర్చు ఏ మేరకు చేయాల్సి వస్తుంది. మనలను గౌరవించే వారి శాతం ఎంత.. అవమానించే వారు ఎందరు ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఏ రాశి వారి జీవితం ఎలా సాగిపోతుంది.. కష్ట సుఖాలు ఎలాఉన్నాయి ... ఇలా అన్నీ లెక్కలు వేసుకుంటారు. పంచాంగ కర్తలు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వావశునామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయ .. వ్యయాలు.. రాజపూజ్యం.. అవమానం గురించి తెలుసుకుందాం.
రాశిపేరు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం
మేషరాశి 02 14 05 07
వృషభ రాశి 11 05 01 02
మిథునరాశి 14 02 04 03
కర్కాటక రాశి 08 02 07 03
సింహరాశి 11 11 03 06
కన్యారాశి 14 02 06 06
తులారాశి 11 05 02 02
వృశ్చికరాశి 02 14 05 02
ధనస్సురాశి 05 05 01 05
మకర రాశి 08 14 04 05
కుంభరాశి 08 14 07 05
మీనరాశి 03 05 03 01
Also Read : బద్రీనాథ్, కేదార్నాథ్ దగ్గర కొత్త రూల్స్
విశ్వావసు నామ సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం 39 వ సంవత్సరం. ఈ సంవత్సరం 2025-2026 కాలంలో మార్చి 2025 నుండి మార్చి 2026 వరకు నడుస్తుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది, ఇది జ్యోతిష్య గణన ఆధారంగా నిర్ణయించబడుతుంది. విశ్వావసు అంటే "విశ్వంలో సర్వమూ వసించేది" అని అర్థం, ఇది సమృద్ధి మరియు సంతులనాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరంలో రాశుల వారీగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి ఫలితాలు జ్యోతిష శాస్త్రం ద్వారా లెక్కించబడతాయి.