
- నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మాదాపూర్ లోని ఇందిరా మహిళా శక్తి బజారులో సోమవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఉగాది, రంజాన్ ఉత్సవాలు నిర్వహించను న్నారు. ఈ ఉత్సవాలను సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి ఇందిరా మహిళా శక్తి బజార్ వేదిక కానున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజారును ఆధునీకరించింది. హైటెక్ సిటీకి పక్కనే ఈ మహిళా బజారును ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వందకుపైగా షాపులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వివిధ రకాల ఆకట్టుకునే వస్తువులు, ఉత్పత్తులు ఈ బజారులో దొరుకుతాయి.