Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది మహోత్సవాలు.. నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం

Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది మహోత్సవాలు.. నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం (మార్చి 29) మహాసరస్వతి అలంకార రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. నంది వాహనంపై మళ్లికార్జునస్వామి, భ్రమరాంభ అమ్మవార్లు దర్శనమివ్వటంతో భక్తులు తరించి పోయారు.  గ్రామోత్సవ వేడుక శ్రీశైల పురవీధులలో వైభవంగా నిర్వహించారు. 

ఉగాది మహోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిభిరాలలో వీరాచార విన్యాసాలు మొదలవుతాయి. శరీరాలపై శూలాలతో గుచ్చుకుంటూ కన్నడిగుల  వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం భక్తులకు కనువిందు చేయనుంది.