ఆదిలాబాద్లో ఘనంగా ఉగాది వేడుకలు

ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  మందమర్రి, రామకృష్ణాపూర్​ , ఆదిలాబాద్​, నిర్మల్​, మంచిర్యాల పట్టణాల్లోని ప్రధాన ఆలయాల్లో పురోహితులు పంచాంగం చెప్పారు.   మందమర్రి ఏరియాలోని కేకే5, ఏరియా వర్క్​షాపు, ఆర్కేపీ సీహెచ్​పీ, ఆర్కేపీ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో  సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఉగాది పచ్చడి పంపిణి చేశారు.   ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కల్యాణం జరిగింది. ఆదిలాబాద్​లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగాది వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్   పాల్గొన్నారు. - వెలుగు, నెట్​వర్క్​