
గంగాధర, వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, లక్నో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో యూపీ రాజధాని లక్నోలోని బత్ఖండే సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఆదివారం ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజెర్రికి చెందిన మల్లిఖార్జున ఒగ్గుకళా సేవా సమితి - ఒగ్గు కళాకారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐఏఎస్ ఆఫీసర్లు కె.రవీందర్‌నాయక్, గురుప్రసాద్, తెలుగు అసోసియేషన్ - లక్నో అధ్యక్షుడు డీఎన్ రెడ్డి చీఫ్ గెస్ట్‌లుగా పాల్గొని కళాకారులకు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ మట్టి కళారూపమైన ఒగ్గుడోలు ప్రదర్శనకు తమ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాకారులు గుంట మహేందర్, ఈర గణేశ్, గడ్డం రాము, మేకల ప్రశాంత్, మొగ్గయ్య, అనిల్, శ్రీకాంత్, విజయ్, శివకుమార్ పాల్గొన్నారు.