తెలుగువారి కొత్త సంవత్సరం: ఉగాది పచ్చడి తయారీ విధానం.. ఇది కచ్చితంగా తినాల్సిందే..

తెలుగువారి కొత్త సంవత్సరం: ఉగాది పచ్చడి తయారీ విధానం.. ఇది కచ్చితంగా తినాల్సిందే..

తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది.   తెలుగు పంచాంగంలో 39వ సంవత్సరం శ్రీ విశ్వావశు నామ సంవత్సరం కావాల్సినవి మార్చి 30 న రాబోతుంది. పురాణలు.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోజు కచ్చితంగా ఆరు రకాలైన పదార్దాలతో తయారు చేసిన ఉగాది పచ్చడికి కచ్చితంగా తినాలని చెబుతున్నారు.  ఎంతో టేస్టీగా.. ఆరోగ్యాన్నిచ్చే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.  .. 

ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి  వెనుక గల అంతరార్ధం ఏమిటంటే ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి, పిండి వంటలు, మహా నైవేద్యం సమర్పించాలి. అనంతరం కుటుంబ సభ్యులంతా మొదటగా ఉగాది పచ్చడి స్వీకరించాలి. అనంతరం బంధుమిత్రులతో కలిసి విందు భోజనాన్ని ఆరగించాలి.

ALSO READ : Ugadi 2025: నవ వసంతం.. ఉగాది పండుగ

ఉగాది పచ్చడి తయారీకి కావలసినవి

  • బెల్లం తురుము: అర కప్పు 
  • లేత వేప పూత: మూడు టేబుల్ స్పూన్స్ 
  • పచ్చి మామిడి ముక్కలు: అర కప్పు 
  • కొత్త చింతపండు రసం: యాభై గ్రాములు 
  • మిరియాల పొడి: ముప్పావు స్పూన్ 
  • రాతి ఉప్పు: అర టీ స్పూన్,  
  • నీళ్లు: ఒకటిన్నర కప్పు 

తయారీ విధానం : ఒక గిన్నెలో బెల్లం తురుము, వేప పూత, చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు, కొత్త చింతపండు రసం, మిరియాల పొడి, రాతి ఉప్పు వేసి, నీళ్లు పోయాలి. బెల్లం కరిగే వరకు నీళ్లను నెమ్మదిగా కలిపితే ఉగాది పచ్చడి రెడీ. బెల్లం తురుముకు బదులు చిన్న చెరుకు ముక్కలు కూడా వాడొచ్చు.  ఇంట్లో పూజ చేసుకొని.. ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి ఆ తరువాత కుటుంబసభ్యులు అందరూ తినాలి. 


–వెలుగు,లైఫ్​–