
కాల గమనంలో మరో ఏడాది కలసిపోనుంది. మార్చి 30 నుంచి తెలుగు వారి కొత్త సంవత్సరం శ్రీ విశ్వావశునామసంవత్సరం ప్రారంభం కానుంది. ఆ రోజున హిందువులందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. పండితులు.. పంచాంగం తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాది పచ్చడి ఏసమయంలో తినాలి.. పూజ ఏ సమయంలో చేసుకోవాలో తెలుసుకుందాం. .
యుగాది అంటే నక్షత్రగమనం .. అదే రోజు యుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. తెలుగు సంవత్సరం ప్రారంభమైన రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో పేరుతో జరుపుకుంటారు. . ఇప్పుడు జరిగే క్రోధినామ సంవత్సరం2025 మార్చి 29న ముగుస్తుంది. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి మొదలు కానుంది. ఈ ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సంప్రదాయంగా జరుపుకుంటారు.
చైత్ర శుద్ధ పాడ్యమి తిధి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండగను జరుపుకోనున్నారు. ఆ రోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది. ఈ రోజున ( మార్చి 30) ఉగాది పండగ ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. ఉగాది పచ్చడిని తినడానికి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయం. ఉదయం 9 గం.నుంచి 11.30 గం. కొత్త బట్టలు ధరించి దేవాలయాలను దర్శించాలని చెబుతున్నారు పండితులు.
►ALSO READ | షష్టగ్రహ కూటమి మొదలైంది : మరో 60 గంటలు ఏం జరగబోతుంది..?
ఇక ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో పలు దేవాలయాల్లో పంచాగ శ్రవణం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి దైవ కార్యక్రమాలకు హాజరయి పండితులు చెప్పే విషయాలను శ్రద్దగా ఆలకించాలి. వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది.. కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను పంచాంగాన్ని వివరిస్తారు. రాశిఫలాలను వివరిస్తూ.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయి.. చేయాల్సిన పరిహారాలను పండితులు చెబుతారు.