ఎండల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల ధరలు

  • కిలో చామంతులు రూ.200 నుంచి రూ.450
  • బంతి పూలు రూ.80 నుంచి 140కు పెరుగుదల

భద్రాచలం, వెలుగు: ఉగాది పండుగపై ఎండల ఎఫెక్ట్ పడింది. పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్​సేల్ రేట్లు మండిపోతున్నాయి. ఒక్కసారిగా రేట్ డబుల్​కావడంతో రిటైల్ ధరలు కూడా అదే రేంజ్‌‌లో ఉన్నాయి. మొన్నటి వరకు కిలో చామంతులు రూ.200, గులాబీలు రూ.200, బంతి పూలు రూ.80, మల్లెలు రూ.400 ఉండగా, ప్రస్తుతం చామంతులు కిలో రూ.450, గులాబీలు రూ.350, బంతి పూలు రూ.140, మల్లెలు రూ.800కు పెరిగాయి. 

గత వారం రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల్లో పూల పంటల దిగుబడులు భారీగా తగ్గాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరా కూడా ఆగిపోయింది. రాబోయే రోజుల్లో పూల ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.