
కుభీర్, వెలుగు: ఉగాది పండుగను పురస్కరించుకొని కుభీర్ లోని శ్రీ విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహిం చారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీగా వచ్చి కుస్తీ పోటీలను ప్రారంభించారు. నియోజకవర్గంతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు.
ప్రజలు భారీగా తరలివచ్చి కుస్తీ పోటీలను ఆసక్తిగా తిలకించారు. విజేతలకు రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పెంటాజీ, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అరవింద్, యాదవ్ సంఘం అధ్యక్షుడు ఉప్పు దత్తు తదితరులు పాల్గొన్నారు.