
తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఉగాది పండుగ రోజును ఏమి చేయాలి.. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది. ప్రతిసంవత్సరం ఉగాది పండుగ చైత్ర శుద్ద పాడ్యమి రోజున వస్తుంది. ఈ ఏడాది ( మార్చి 30)న వచ్చింది. ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తి .. చేప రూపంలో అవతారం దాల్చి .. సోముని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు. శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు.
ఉగాది రోజున ఏం చేయాలి.
ఉగాది పండుగ రోజు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేని కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు... కుంకుమ రాసి అలంకారం చేయాలి. గడప అంటే లక్ష్మీదేవితో సమానం.. ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ... విష్ణుమూర్తిని.... లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే శివుడికి రుద్రాభిషేకం.. బిల్వార్చ చేయాలి. విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, లేదా విష్ణుమూర్తి సహస్రనామం, లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి. భక్తితో, విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను. పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు, నాకు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి. ఆ తరువాత దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. బ్రాహ్మణులకు కొత్త బట్టలు.. పంచాగం దానం చేసి.. దక్షిణ ఇవ్వాలి. గాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. దీనితో పాటు, మన పెద్దలు ఉగాది నాడు విసినకర్ర కొనేవారు. కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు.
ఇంకా ఏమేమి చేయాలంటే..
- ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి
- ఆరోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు.
- ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకోరేట్ చేసి, భక్తితో దేవుడిని పూజించుకోవాలి
- చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, మామిడి, వేపుపూతతో, ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి
- ఎండాకాలం నడుస్తోంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్లతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి.
- అదేవిధంగా దేవాలయంకు వెళ్లి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి.
ఏమేమి చేయకూడదు.
- సూర్యోదయం అయిన తరువాత అసలు నిద్రపోకూడదు
- మాంసాహారాన్ని తినరాదు
- మద్యం సేవించకూడదు.. పొగ తాగకూడదు.
- దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం ( వినుట) చేయకూడదు.
- ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు.
- చిరిగిన.. మాసిపోయిన దుస్తులు ధరించకూడదు.