
పద్మారావునగర్, వెలుగు: ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో పద్మారావునగర్‌లోని హమాలీ బస్తీలో బండరాయి ఎత్తే పోటీలు నిర్వహించారు. 120 కిలోల బరువున్న బండరాయిని ఎత్తిన వారిని మొనగాడుగా ప్రకటించి సన్మానిస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ఉత్సాహవంతులు తరలివచ్చారు.
నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన ఎం.విజయ్, శ్రీనివాస్, హనుమదాస్, ఖలీల్, కర్నాటకలోని సేడంకు చెందిన శివ, శ్రీనివాస్, షాను, భాస్కర్ 120 కిలోల బరువున్న గుండ్రటి బండరాయిని ఎత్తారు. వీరంతా హమాలీ బస్తీలో స్థిరపడి కూలిపని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.