నల్లవాగు ప్రాజెక్టును సందర్శించిన ఉగాండా సైంటిస్టులు

నల్లవాగు ప్రాజెక్టును సందర్శించిన ఉగాండా సైంటిస్టులు

నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టును శుక్రవారం ఉగాండ దేశానికి చెందిన సైంటిస్టులు సందర్శించారు. నీటిపారుదల శాఖ ఈఈసీ విజయకుమార్, ప్రాజెక్టు డీఈ పవన్​కుమార్, ఖేడ్ డివిజన్ అధికారులుప్రాజెక్టు గురించి వారికి వివరించారు. కుముమాన్య బెన్ అనే అధికారి నేతృత్వంలో  నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్, ఆర్థిక శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ఈ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా వారు నల్లవాగు ప్రాజెక్టు కట్ట, కుడి, ఎడమ, అత్యవసర కాల్వలను, అతిథి గృహాన్ని, అలుగును పరిశీలించారు.

అనంతరం ఆయకట్టు కింద ఉన్న భూములను పరిశీలించి  రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగాండా దేశంలో నల్లవాగు మాదిరిగా ప్రాజెక్టును నిర్మించడం కోసం వీరు ఈ అధ్యయనానికి వచ్చినట్లు డీఈ పవన్ కుమార్ తెలిపారు. అనంతరం స్థానిక కాంగ్రెస్​నాయకులు వీరిని సన్మానించారు. వీరి వెంట నీటిపారుదల శాఖ ఏఈలు సూర్యకాంత్, రవీందర్, ఇతర డివిజన్లకు చెందిన డీఈలు, ట్రైనీ ఏఈలు, సిబ్బంది ఉన్నారు.