అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మార్గదర్శకాలు పాటించని ఉగాండా క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. మరో రెండు రోజుల్లో ప్రపంచ కప్ టోర్నీ మొదలవ్వనుండగా.. ఆ టీమ్ జెర్సీపై అభ్యంతరం తెలిపింది. ఆ జట్టు జెర్సీపై స్పాన్సర్ లోగోలు స్పష్టంగా కనిపించకపోవడంతో డిజైన్ మార్చుకోవాలని సూచించింది. దీంతో చేసేదేమీలేక ఉగాండా క్రికెట్ అసోసియేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజైన్‌ను మార్చింది.
భుజాలపై జాతీయ పక్షి ఆనవాళ్లు
తొలుత ఉగాండా బోర్డు పసుపు రంగులో జెర్సీని విడుదల చేసింది. ఆ జెర్సీ భుజాలపై ఉగాండా జాతీయ పక్షి గ్రే క్రౌన్డ్ క్రేన్(Grey Crowned Crane) ఆనవాళ్లకు గుర్తుగా ఈకలను ముద్రించింది. అయితే, ఈకల రంగు రంగు కారణంగా వరల్డ్ కప్ స్పాన్నర్ లోగోలు స్పష్టంగా కనిపించడం లేదు. దాంతో, ఆ నమూనాలను తొలగించాలని ఐసీసీ ఉగాండా క్రికెట్ అసోసియేషన్‌ను కోరింది. అందుకు సానుకూలంగా స్పందించిన ఆ దేశ క్రికెట్ అసోసియేషన్ డిజైన్‌ను మార్చింది. రెక్కలుగల నమూనాలు స్లీవ్‌లపై ఇప్పటికీ ఉన్నప్పటికీ, అవి దూరం నుండి కనిపించవు. ఐసీసీ బలవంతపు మార్పు ఉగాండా ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Uganda are ready for the #T20WorldCup 🇺🇬💥 pic.twitter.com/jQ56ibchrO
— ICC (@ICC) May 29, 2024
టీ20 ప్రపంచ కప్‌లో ఉగాండా జట్టు తమ తొలి మ్యాచ్‍లో ఆఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. జూన్ 4న గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఉగాండా వరల్డ్ కప్ జట్టు:
బ్రియాన్ మసబ(కెప్టెన్), సిమన్ సెసాజీ, రోజెర్ ముకాసా, కాస్మస్ కీవుట, దినేశ్ నక్రాని, ఫ్రెడ్ అచెలామ్, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రమ్జానీ, ఫ్రాంక్ సుబుగ, మెన్రీ సెన్యొడో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఒబుయ, రియాజట్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్.