డిగ్రీని రెండేండ్లలోనే పూర్తి చేయొచ్చు...స్టూడెంట్లకు వెసులుబాటు కల్పించనున్న యూజీసీ

న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్‌‌‌‌ స్టూడెంట్ల కోసం ఇకపై డిగ్రీ కోర్సును తగ్గించుకునే లేదా పొడిగించుకునే వెసులుబాటును యూజీసీ కల్పించనుంది. ఈ సౌకర్యాన్ని త్వరలో హయ్యర్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్ సంస్థలు తీసుకురానున్నాయని యూజీసీ చైర్మన్‌‌‌‌ జగదీశ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు చదివే సామర్థ్యం ఆధారంగా డిగ్రీ కోర్సును పొడిగించడం లేదా తగ్గించడం చేసుకోవచ్చని చెప్పారు.

ప్రస్తుతం డిగ్రీ మూడేండ్ల కోర్సు కాగా, విద్యార్థులకు చదివే సామర్థ్యం ఎక్కువగా ఉంటే రెండేండ్లలోనే కోర్సును కంప్లీట్‌‌‌‌ చేయొచ్చన్నారు. యాక్సిలరేటెడ్‌‌‌‌ డిగ్రీ ప్రోగ్రామ్‌‌‌‌ (ఏడీపీ) ద్వారా ప్రతి సెమిస్టర్‌‌‌‌‌‌‌‌లో అదనపు క్రెడిట్స్‌‌‌‌ సంపాదించడం వల్ల తక్కువ సమయంలో డిగ్రీ కోర్సును కంప్లీట్‌‌‌‌ చేయొచ్చని వెల్లడించారు. అయితే, ఎక్స్‌‌‌‌టెండెడ్‌‌‌‌ డిగ్రీ ప్రోగ్రామ్‌‌‌‌ (ఈడీపీ)తో డిగ్రీ టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ని నాలుగేండ్లకు కూడా పెంచుకోవచ్చని తెలిపారు. ప్రతి సెమిస్టర్‌‌‌‌‌‌‌‌లో తక్కువ క్రెడిట్స్‌‌‌‌ వచ్చిన వారికి ఈ ఆప్షన్‌‌‌‌ ఎంచుకోవచ్చన్నారు.