న్యూఢిల్లీ: భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల్లో త్వరలో ఉమ్మడి డిగ్రీలు, సంయుక్త కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఉన్నత విద్యామండలి సమావేశంలో నిబంధనలు ఖరారు చేసినట్లు చెప్పారు. ఆన్ లైన్ కార్యక్రమాలు, ఓపెన్, దూరవిద్యలకు ఈ రూల్స్ వర్తించవని స్పష్టం చేశారు.పై కార్యక్రమాల అమలుకు భారతీయ విద్యాసంస్థలు ఆయా కౌన్సిళ్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. విదేశీ ఉన్నత విద్యాసంస్థకు, భారతీయ ఉన్నత విద్యాసంస్థకు మధ్య ఎటువంటి ఫ్రాంచైజీ, అధ్యయన కేంద్రం ఉండబోవని జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు.
University Grants Commission (UGC) has taken a decision on regulation for academic collaboration between Indian and foreign higher education institutions to offer training, joint degree, and dual degree programs: Jagadesh Kumar, UGC Chairman pic.twitter.com/tt8Z8zB9fp
— ANI (@ANI) April 19, 2022
మరిన్ని వార్తల కోసం...