ఎం.ఫిల్ డిగ్రీ కిందకు రాదా..: యూజీసీ ఏం చెబుతోంది

ఎం.ఫిల్ డిగ్రీ కిందకు రాదా..: యూజీసీ ఏం చెబుతోంది

మీరు ఎం.ఫిల్ (M.Phil)  చేయాలనుకుంటున్నారా.. మీకు ఏదైనా యూనివర్సిటీ ఎం.ఫిల్  డిగ్రీ కోర్సును ఆఫర్ చేసిందా..ఎం.ఫిల్ ను మీరు డిగ్రీ గా భావిస్తున్నారా.. అయితే యూజీసీ ఏం చెబుతుం దో.. యూజీసీ ఇటీవల రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో ఏం చెబుతుంతో తెలుసుకుందాం.

ఎం.ఫిల్ డిగ్రీ కాదట.. ఏదైనా యూనివర్సిటీ ఎం.ఫిల్  (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ) కోర్సులను ఆఫర్ చేస్తే తీసుకొవద్దని నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఇటీవల కాలంలో కొన్ని విశ్వ విద్యాలయాలు M.Phil(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు UGC  దృష్టికి రావడంతో.. ఎం.ఫిల్ కు డిగ్రీ గుర్తింపు పొందిన డిగ్రీ కాదని తెలిపింది.

UGC రెగ్యులేషన్ నెం. 14(పీ.హెచ్డీ డిగ్రీని అందించడానికి కనీస ప్రమాణాలు, విధానాలు) నిబంధనలు 2022 ప్రకారం..ఉన్నత విద్యాసంస్థలుM.Phil ప్రోగ్రామ్  ను అందించకూడదని అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎం.ఫిల్ ప్రోగ్రామ్ కు అడ్మిషన్లు  నిలిపివేయాలని యూనివర్సిటీ అధికారులను కోరింది.