![యూజీసీ కీలుబొమ్మలా మారింది](https://static.v6velugu.com/uploads/2025/02/ugc-has-become-a-puppet-say-professor-haragopal_G5vgHQ9uyd.jpg)
- ప్రొఫెసర్ హరగోపాల్
బషీర్ బాగ్, వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా మారిందని ప్రొఫెసర్ హరగోపాల్, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి అధ్యక్షతన ‘యూజీసీ 2025 రూల్స్ – వర్సిటీల స్వయం ప్రతిపత్తిపై దాడి’ అంశంపై ఆదివారం జాతీయ సదస్సు జరిగింది.
చీఫ్ గెస్ట్ లుగా ప్రొ. హరగోపాల్, ప్రొ. కాశీం, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ పాండ, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ పాల్గొని మాట్లాడారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన యూజీసీ కొత్త మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు.