కళలు, సైన్స్, వాణిజ్యం, సాంఘిక శాస్త్రాలలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల కోసం 12 భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు రాసేందుకు యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ రచయితలు, విమర్శకులు, ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుసు, ఊర్ధూ భాషల్లో పుస్తకాలు రాయడానికి కమషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
UGC భారతీయ భాషలలో కళలు, సైన్స్, వాణిజ్యం, సాంఘిలక శాస్త్రాలలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో పాఠ్య పుస్తకాలను అందించేందుకు కృషి చేస్తోంది. భారతీయ భాషల్లో నాణ్యమైన పాఠ్యపుస్తకాలను రాయగల రచయితల బృందాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని నోడల్ యూనివర్సిటీల గుర్తింపు జరుగుతోంది.
ఆసక్తిగల రచయితలు తమ అంగీకారాన్ని కమిషన్ కు పంపడానికి జనవరి 30 వరకు సమయం ఇచ్చింది.పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుదారులు ఏ కోర్సులో , ఏభాషలో పుస్తకాన్ని రాయాలో కూడా స్పష్టంగా తెలియజేయాలి.