![యాంటీ ర్యాగింగ్ రూల్స్ పాటించని..18 మెడికల్ కాలేజీలపై యూజీసీ కొరడా](https://static.v6velugu.com/uploads/2025/02/ugc-issues-showcause-notices-to-18-medical-colleges-for-non-compliance-with-anti-ragging-norms_XDOZTPBUou.jpg)
మెడికల్ కాలేజీలపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కొరడా ఝుళిపించింది. యాంటీ ర్యాగింగ్ రూల్స్ పాటించని మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 18 మెడికల్ కాలేజీలకు నోటీసులిచ్చింది. డిఫాల్టర్ మెడికల్ కాలేజీలలో ఢిల్లీ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలలో ఒక్కొక్కటి రెండేసీ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్‌లలో ఒక్కొక్కటి మూడు, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ,ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్క కాలేజీ చొప్పున యూజీసీ నోటీసులు జారీ చేసింది.
ర్యాగింగ్‌ను అరికట్టేందుకు 2009 యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్‌లో పేర్కొన్న తప్పనిసరి నిబంధనలను ఈ కళాశాలలు పాటించలేదని తేల్చింది. ప్రత్యేకించి ర్యాగింగ్ నిరోధక చర్యలను చేపట్టడంలో సంస్థలు విఫలమైనట్లు గుర్తించింది.
2009 యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారం.. ప్రతి విద్యార్థి ,వారి తల్లిదండ్రులు ,తప్పనిసరిగా అడ్మిషన్ సమయంలో తప్పనిసరిగా ర్యాగింగ్ నిరోధక రెస్పాంసిబులిటీ డిక్లరేషన్ ను సమర్పించాలి. ఇది విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను అరికట్టేందుకు కీలకమైనది.
ఇచ్చిన గడువులో ఈ 18 కాలేజీలు వివరణ ఇవ్వడంలో విఫలమైతే 2009 యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం..జరిమానా, దిద్దుబాటు చర్యలతో పాటుచట్టపరమైన కఠిన చర్యలుంటాయని యూజీసీ హెచ్చరించింది.
ప్రభుత్వ పరంగా, విద్యాశాఖ పరంగా ఎన్ని చర్యలు చేపట్టిన ర్యాగింగ్ భూతానికి అమాయక విద్యార్థులు బలవుతున్నారు. కొన్ని కాలేజీ యాంటీ ర్యాగింగ్ నిబంధనలు పక్కన బెట్టడం వల్లే ఇటువంటి దుర్ఘటనలు తలెత్తున్నాయని తెలుస్తోంది. తప్పనిసరిగా యాంటీ ర్యాగింగ్ రూల్స్ అటు విద్యాసంస్థలు, ఇటు విద్యార్థులు పాటిం చాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తు్న్నాయి.