
దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్‌షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్) అర్హతకు నిర్వహించే యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)- డిసెంబర్ 2021 & జూన్ 2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 20వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
అర్హత: హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజెస్ కలుపుకొని), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వారు, మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు www.ugcnet.nta.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీలు త్వరలో వెల్లడిస్తారు.