నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం UGC-NET 2024 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 18న నిర్వహించారు. కాగా ఒక్కరోజులోనే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా మంగళవారం 317 నగరాల్లో, 1205 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. 11 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైం కో ఆర్టినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో NTA ఈ నిర్ణయం తీసుకుంది.
UGCNET పరీక్షను రీషెడ్యూల్ చేయనున్నామని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరీక్ష నిర్వహణపై సిబిఐతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే నీట్ యూజీసీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఇటు నీట్ ఎగ్జామ్ కూడా నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నే..
Government is committed to ensure the sanctity of examinations and protect the interest of students.
— Ministry of Education (@EduMinOfIndia) June 19, 2024
Ministry of Education has decided that the UGC-NET June 2024 Examination be cancelled on the basis of inputs from Indian Cyber Crime Coordination Centre (I4C) under the Ministry…