
యూనివర్సిటీలు, కాలేజీల్లో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారితో పాటు టాప్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ చేయాలనుకునే అభ్యర్థుల కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) జూన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో క్వాలిఫై అయితే సైన్స్ కోర్సుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ మొదలు పెట్టడంతో పాటు జూనియర్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా పరిశోధనలు చేసి పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం..
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) జాతీయ అర్హత పరీక్ష (నెట్)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. సైన్స్ కోర్సుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ ఫీల్డ్‌లో రాణించడానికి నెట్ లెక్చరర్‌షిప్‌లో అర్హత పొందడం తప్పనిసరి. అలాగే స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీ కోసం జేఆర్‌ఎఫ్‌లో ఎంపిక కావాలి. ఫెలోషిప్‌కి ఎంపికైనవారు నేషనల్ ల్యాబ్స్, ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరిశోధనలతో మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ...మొదలైనవి చదువుకున్నవారికి జేఆర్‌ఎఫ్ కోసం అవకాశం ఉంది. వీరు లెక్చరర్‌షిప్‌కు అనర్హులు.
ఎగ్జామ్ ప్యాటర్న్
అభ్యర్థి సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి.
పార్ట్ 1: అన్ని విభాగాల వారికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైనవాటికి సంబంధించిన 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.
పార్ట్ 2: ఈ విభాగంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆ సబ్జెక్టు ప్రకారం ప్రశ్నల సంఖ్య మారుతుంది. సంబంధిత సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు ఉంటాయి. చాయిస్ ఉంది. ఈ విభాగానికి ఆ సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఉంటాయి.
పార్ట్ 3: ఈ విభాగంలో ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. చాయిస్ ఉంటుంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి.సైంటిఫిక్ కాన్సెప్టులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి.
మొత్తం ప్రశ్నపత్రం నుంచి సబ్జెక్టులవారీ.. ఫిజిక్స్‌లో 75 ప్రశ్నలకు గానూ 55, మ్యాథమ్యాటికల్ సైన్సెస్‌లో 120కి 60, లైఫ్ సైన్సెస్‌లో 145కి 75, కెమికల్ సైన్సెస్‌లో 120కి 75, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్‌లో 150కి 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది.
స్టయిఫండ్: జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై, పరిశోధనలు కొనసాగించేవారికి తొలి రెండేళ్లు ప్రతి నెలా రూ.31,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్ అర్హత సాధించినవారికి నెలకు రూ.35,000 చొప్పున అందుతుంది. దీంతోపాటు ఉచిత వసతి లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కింద చెల్లిస్తారు.
అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌స్సీ లేదా బీఈ / బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీ విద్యార్థులూ 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్‌సీ, ఎస్‌టీ, థర్డ్ జండర్, దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు గరిష్ట వయసు పరిమితి జులై 1, 2020 నాటికి 28 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, థర్డ్ జండర్, దివ్యాంగులు, మహిళలకు అయిదేళ్ల సడలింపు ఉంది. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు మినహాయింపు వర్తిస్తుంది. లెక్చరర్‌షిప్‌కు వయసు నిబంధన లేదు.
చివరి తేదీ: 2 జనవరి 2022
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1000, ఓబీసీ- నాన్ క్రీమీలేయర్‌కు రూ.500, ఎస్‌సీ/ ఎస్‌టీ/ థర్డ్ జండర్లకు రూ.250. దివ్యాంగులు ఫీజు లేదు. ఎగ్జామ్: జనవరి 29, 5, 6 ఫిబ్రవరి 2022లో నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్. వెబ్‌సైట్: www.csirnet.nta.nic.in విభాగాలు: కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
నెట్ బెనిఫిట్స్
నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్‌లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ సమయంలోనే యావరేజ్ శాలరీ సంవత్సరానికి ఆరు లక్షల వరకు ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా ప్రమోషన్లు లభిస్తాయి. ఈ దశలో దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వేతనాలు అందుకోవచ్చు. ఫుల్‌టైమ్ టీచింగ్ కెరీర్ కాకుండా డిఫరెంట్ గా ఆలోచించేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆథర్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్, ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, ల్యాబ్ ట్రైనర్ వంటి పోస్టులను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ రంగంలోని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు నెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సంస్థలు రిక్రూట్ చేసుకుంటాయి. జేఆర్‌ఎఫ్ క్వాలిఫై అయినవారు యూనివర్శిటీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయాలి. అనంతరం సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోషన్ వస్తుంది. దీంతో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకు జేఆర్‍ఎఫ్‍కు రూ.31, ఎస్‍ఆర్‍ఎఫ్‍కు రూ.35 వేల ఫెలోషిప్ లభిస్తుంది.