యూజీసీ కొత్త రూల్స్‌‌తో విద్యార్థులకు నష్టం: కేటీఆర్

యూజీసీ కొత్త రూల్స్‌‌తో విద్యార్థులకు నష్టం: కేటీఆర్
  • రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి 
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌కు కేటీఆర్ విజ్ఞప్తి
  • మిడ్ మానేరు మీదుగా  రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వేయాలని మరో మంత్రి గడ్కరీకి రిక్వెస్ట్
  • రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి 
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటీఆర్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, హక్కులను హరించకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నూతన నిబంధనలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి గురువారం ఢిల్లీలోని పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తొలుత యూజీసీ నూతన నిబంధనలకు సంబంధించిన అంశంపై ధర్మంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. తర్వాత నేషనల్ హైవే 365బీ విస్తరణపై నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశాం అయ్యారు. అనంతరం విజయ్ చౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనలో చేయాల్సిన మార్పులపై బీఆర్ఎస్ ఆలోచనలను ఆరు పేజీల లేఖ రూపంలో ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్ర పరిధిలోని వర్సిటీల వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్ల నియామకానికి వేసే సెర్చ్ కమిటీలకు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగిస్తూ కేంద్రం తీసుకురానున్న యూజీసీ నిబంధనలు సరికాదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడమే అని ఆరోపించారు.

ఇది ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అలాగే, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే ఒక నిబంధనను తీసుకురావడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోతారని చెప్పారు. అభ్యర్థులు దొరకలేదని సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలను భర్తీ చేసే ప్రమాదముందన్నారు. ఇది రాజ్యాంగం ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన హక్కును హరించడమే అవుతుందన్నారు. యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీలో కేవలం విద్యార్హతలపై మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రికి సూచించినట్లు ఆయన చెప్పారు. 

ధవళేశ్వరం మాదిరిగా రోడ్ కం రైల్ బ్రిడ్జి నిర్మించండి.. 

సిరిసిల్ల వరకు నిర్మాణం అవుతున్న నేషనల్ హైవే–365బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జి మాదిరిగా మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి, వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారిని 63 కలిపేలా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ నెల 10న సుప్రీంకోర్టు ముందుకు రానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అడ్వొకేట్ బృందంతో తమ బృందం సమావేశమవుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కోర్టు నోటీసులు జారీ చేసిందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా పోరాడుతామని తెలిపారు.