- నిందితుల అరెస్ట్ కు బాధిత కుటుంబం డిమాండ్
- చిన్న గూడూరు పీఎస్ వద్ద బైఠాయించి నిరసన
మరిపెడ,(చిన్న గూడూరు), వెలుగు: తమపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా ఉగ్గంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బా పట్టుకుని మంగళవారం చిన్న గూడూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకా రం.. దసరా రోజు చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కత్తులతో దాడి చేసుకోగా.. ప్రశాంత్, మహేశ్, మురళీ, మధు, నాగరాజు,వెంకన్న తీవ్రంగా గాయపడగా.. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాం డ్ కి తరలించారు. దాడికి పాల్పడిన గ్రామానికి చెందిన దాసరి వెంకన్న, రాజు, యాకన్న, ప్రత్యూష, కళమ్మ, సురేశ్, సరిత, మహేశ్, గండసిరి సాయిపై కేసు నమోదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితుడు ప్రశాంత్ భార్య యమున, తండ్రి రమేశ్‌తో పాటు బంధువులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. చిన్నగూడురు ఎస్ ఐ ఝాన్సీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ నిందితులను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. తమపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బా పట్టుకుని స్టేషన్ ముందు నిరసనకు దిగారు. దీంతో మరిపెడ ఎస్ఐ సతీశ్వెళ్లి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.