విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర(Upendra)కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. అయితే కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఆయన..మరోసారి వినూత్న కాన్సెప్ట్తో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకుడిగా తీస్తున్న మూవీ UI. రీసెంట్గా ఈ సినిమా నుంచి వరల్డ్ అఫ్ UI పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేయగా..ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.
లేటెస్ట్గా UI మూవీకి సంబంధించిన అప్డేట్ సినీ సర్కిల్లో వినిపిస్తోంది. హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన డబ్బింగ్ చెప్తున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, ఈ సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండటంతో..సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.
Preparing to enthrall you with a MASSIVE experience ??
— UI The Movie (@UI_TheMovie) February 8, 2024
Our @nimmaupendra ????????? ??????? for the Magnum Opus #UITheMovie in Telugu in Hyderabad ❤️?❤️?#Upendra #UppiDirects @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth #NaveenManoharan pic.twitter.com/mTA8QfOuRU
సరికొత్త కథాంశంతో వస్తోన్న UI తో మరోసారి ఉపేంద్ర మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్లో చూపించిన విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే మైండ్ బ్లోయింగ్ ఇచ్చారు ఉపేంద్ర.
ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్..లాంటి విభిన్న కథలతో డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర..ఇపుడు వరల్డ్ఆఫ్ UI తో వస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక UI సినిమాను మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తుండగా..రీష్మా నానయ్య హీరోయిన్గా నటిస్తోంది.సన్నీ లియోన్ మరో కీలక పాత్రలో కనిపిస్తుంది. కాంతర సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో..ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి మరి.