ఈ-కేవైసీలోకి యూఐడీఏఐ, ఎన్​పీసీఐ

ముంబై: యూఐడీఏఐ, నేషనల్ పేమెంట్స్‌‌‌‌ కార్పొరేషపన్‌‌‌‌ ( ఎన్​పీసీఐ) లు కలిసి దేశంలో కొత్తగా ఈ–కేవైసీ ప్లాట్​ఫామ్​ ఏర్పాటు చేయనున్నాయి. దీంతో చాలా రెగ్యులేటెడ్​ ఎంటిటీలకు బెనిఫిట్ కలుగుతుందని ఆశిస్తున్నారు. రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, సెక్యూరిటీస్​ ఎక్స్చేంజ్​ బోర్డ్ ఆఫ్​ ఇండియా (సెబీ), ఐఆర్​డీఏ, పీఎఫ్​ ఆర్​డీఏ వంటి రెగ్యులేటరీ సంస్థల పరిధిలో పనిచేసే వివిధ కంపెనీలకు, ఇతర సంస్థలకు ఈ ఈ–కేవైసీ ప్లాట్​ఫామ్​ చాలా ఉపయోగకరంగా ఉండనుంది. కొత్త మొబైల్​ కనెక్షన్లకు, బ్యాంక్‌‌‌‌ అకౌంట్ల ఓపెనింగ్​కు పేపర్ ​లెస్​ వెరిఫికేషన్​ప్రక్రియనే చేపడుతున్నారు. ఆధార్​ ఆధారంగా ఈ–కేవైసీ ప్రక్రియను ఇందుకోసం వినియోగిస్తున్నారు.

రాబోయే కొన్ని నెలల్లో యూఐడీఏఐ, ఎన్​పీసీఐ ఏర్పాటు చేసే ప్లాట్​ఫామ్​ అందుబాటులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్​ సాయంతో కస్టమర్ల నుంచి  ఈ–కేవైసీ తీసుకునేందుకు ఇప్పటిదాకా ఎన్​బీఎఫ్​సీలు, ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్​ పొందేవి. ఇప్పుడు ఆయా కంపెనీలకు, సంస్థలకు ఆ అవసరం ఉండదు. అంతేకాదు, యూజర్లకు కూడా చాలా భదత్ర కలగనుంది. ఎందుకంటే ఆ యూజర్ల డేటాను ఎన్​బీఎఫ్​సీలు లేదా ఇతర సంస్థలతో ఈ కొత్త  ప్లాట్​ఫామ్​ షేర్​ చేసుకోదు. ఫైనాన్షియల్​ సర్వీసెస్​ రంగంలోని కంపెనీలకు ఆధార్​లోని  చివరి నాలుగు అంకెలను మాత్రమే కనిపించేలా చేస్తారు. మాస్క్​ చేసిన కన్జూమర్ల డేటాను సైతం వాటితో షేర్​ చెయ్యరు. యూజర్లు తమ డాక్యుమెంట్ల ఫిజికల్​ కాపీలను ఇవ్వాల్సిన ఆవశ్యకతా ఉండదు. దీంతో తమ డేటా చోరీకి గురవుతుందనో లేదా మిస్​ యూజ్​ అవుతుందనో యూజర్లు భయపడాల్సిన అవసరం ఉండదు. కొన్ని వేల కంపెనీలు యూఐడీఏఐ, ఎన్​పీసీఐ ఈ–కేవైసీ ప్లాట్​ఫామ్​ వాడుకుంటాయి.