ఫ్రీ ఆధార్ అప్‌డేట్‌కు మరో అవకాశం : లాస్ట్ డేట్ పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

ఫ్రీ ఆధార్ అప్‌డేట్‌కు మరో అవకాశం : లాస్ట్ డేట్ పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఆధార్ అప్‌డేట్‌ చేసుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది. UIDAI ముందుగా 2024 సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. సెప్టెంబర్ 14న(ఈరోజు) ఆ చివరి తేదీని పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆధార్ అప్ డేట్ చేసుకోవడానికి 2024 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇస్తున్నట్లు UIDAI తెలిపింది. ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తీదీ, చిరునామా ఇంకా ఇతర వివరాలు ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఫ్రీగా మార్చుకోవచ్చు. ఫ్రీగా అప్ డేట్ చేసుకో ఇంటి సౌకర్యం నుండి సులభంగా మార్పులు చేయవచ్చు.

దీంతో ఐరిస్ స్కాన్‌లు, ఫేస్,  బయోమెట్రిక్ వంటి వివరాలు ఆన్‌లైన్‌లో అప్ డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు మంజూరు చేసి 10 సంవత్సరాలు కావొస్తుంది. ఇప్పటి వరకు ఆధార్ లో తప్పులు ఉన్న వివరాలు ఇప్పుడు ఇచ్చితంగా మార్చుకోవచ్చు. 2024 డిసెంబర్ 14 తర్వాత ఆధార్ అప్ డేట్ కు రూ.50 ఖర్చు అవుతుంది.

ALSO READ | ఎన్నికల సంస్కరణలపై కమిటీలు.. సిఫారసులు