గుడ్ న్యూస్ .. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు మళ్లీ పొడిగింపు

ఆధార్ కార్డు ఉన్నవారికి మరోసారి శుభవార్త అందించింది యూఐడీఏఐ. ఆధార్ అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నవారు 2024 జూన్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. మై ఆధార్ పోర్టల్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రజలంతా తమ ఆధార్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. 

 ఆధార్ కేంద్రాల్లో రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  ఇంతకుముందు 2024 మార్చి 14 వరకు ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువుగా నిర్ణయించింది.  తాజాగా ఆ గడువును పోడిగించింది. ఈ క్రమంలోనే  మైఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు అవకాశం లభించినట్లయింది.

అప్‌డేట్‌ చేసుకోండిలా..

* https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ కావాలి. 
*  ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు ‘ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి
* అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి
* రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్‌ అప్‌డేట్‌’పై క్లిక్‌ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ‘ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. 
* ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. 
* 14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.
* ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ALSO READ :- లేడీ డాన్ తో గ్యాంగ్‌స్టర్ పెళ్లి.. 250 మంది పోలీసుల బందోబస్తు