
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆటోపై రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఉజ్జయినిలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర రక్తస్రావంతో కనిపించిన ఈ బాలిక కేసులో ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఆటో డ్రైవర్ వయస్సు 38 సంవత్సరాలు. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని పోలీసులు తెలిపారు. దాంతో పాటు ఆటోపై రక్తపు మరకలు కనిపించాయని చెప్పారు.
ఆటోకు ప్రస్తుతం ఫోరెన్సిక్ పరీక్ష కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. అయితే, బాధితురాలు సహాయం కోసం వేడుకుంటూ కాలినడకన నడిచిన 8 కిలోమీటర్ల పరిధిలోని సీసీటీవీ ఫుటేజీని పొందినట్లు వారు తెలిపారు.
ఉజ్జయినీ హర్రర్
ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో అత్యాచారానికి గురై రక్తస్రావంతో ఉన్న 12 ఏళ్ల బాలికకు సెప్టెంబర్ 27న ప్రత్యేక వైద్యుల బృందం శస్త్రచికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని ఒక అధికారి తెలిపారు. వీధిలో రక్తస్రావంతో వెళ్తున్న బాలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి మహకాల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.